Friday, May 8, 2026
E-PAPER
Homeజాతీయంమధ్యాహ్న భోజనంలో పాము పిల్ల

మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల

- Advertisement -

బీహార్ లో 250 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

పాట్నా : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజన నాణ్యతకు సంబంధించిన వార్తలు తరచూ వింటూనే ఉంటాం. అయితే, ఓ చోట విద్యార్థులు తినే భోజనంలో ఏకంగా పాము పిల్ల దర్శనమివ్వడం కలకలం రేపింది. అంతేకాదు, ఆ ఆహారాన్ని తిన్న వారందరూ అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఉదంతం గురువారం బిహార్లో వెలుగుచూడగా, రాష్ట్రవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది.

అసలేం జరిగింది?
విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. సహర్సా జిల్లాలోని మహిషి బ్లాక్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు వడ్డించారు. అయితే భోజనం పెడుతున్న క్రమంలో అందులో ఓ పాము పిల్ల కనిపించింది. దీంతో దాన్ని చూసినవారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే పాఠశాల యాజమాన్యం తేరుకునే లోపే చాలామంది విద్యార్థులు ఆ ఆహారాన్ని తినేశారు. దీంతో 250 మందికిపైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వారిలో కడు పునొప్పి, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిం చాయి. విద్యార్థులు అస్వస్థతకు గురికావడాన్ని గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమయ్యారు.

ఆరోగ్య కేంద్రంలో చికిత్స
విద్యార్థులను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో విద్యార్థులు రావడంతో ఆరోగ్య కేంద్రంలో భారీ రద్దీ ఏర్పడింది. మరోవైపు, వైద్య బృందాలు నిరంతరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తిన్న కొద్దిసేపటికే వాంతులు
అయితే, ఈ ఘటనపై కొంతమంది విద్యార్థులు స్పందించారు. ఈ సందర్భంగా ఐదో తరగతి విద్యార్థి రోహిత్ కుమార్ మాట్లాడాడు. “ఉదయం 10 గంటల సమయంలో అందరం పాఠశాలలో అన్నం, పప్పు తిన్నాం. ఆహారం తిన్న కొద్దిసేపటికే కడుపు నొప్పి, వాంతులు, తల తిరగడం ప్రారంభమయ్యాయి” అని చెప్పాడు. భోజనం చేసిన తర్వాత చాలా మంది అస్వస్థతకు గురయ్యారని మరో విద్యార్థిని తెలిపింది.

నిలకడగా పిల్లల ఆరోగ్యం
విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, ఆరోగ్య శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సహర్సా సివిల్ సర్జన్ డాక్టర్ రాజనారాయణ్ ప్రసాద్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పర్యవేక్షించారు. అయితే, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -