సీపీఐ(ఎం) నుంచి ఆర్‌.రఘు బహిష్కరణ

పార్టీ రాజకీయ విధానం, పార్టీ కార్యక్రమంపై విభేదాలు ఉన్నాయనే నెపంతో పార్టీ విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆర్‌.రఘును పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కష్ణా జిల్లా కమిటీ బహిష్కరించింది. గతంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగాను ఉన్న పరిచయాలను ఉపయోగించు కుని పార్టీని నష్టపరిచే చర్యలకు ఆయన పాల్పడుతున్నారు.ఆయన లేవనెత్తిన విషయాలను పార్టీ ఆయనతో చర్చించి సరిదిద్దేందుకు పలు ప్రయత్నాలు చేసింది. వాటిని సరిదిద్దుకోకపోగా పార్టీ విచ్ఛిన్న కార్యకలాపాలు తీవ్రతరం చేసినందున పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించాలని ఈ రోజు (14 ఆగష్టు) ఉయ్యూరులో జరిగిన కష్ణా జిల్లా కమిటీ సమావేశం ఏకగ్రీవం గా తీర్మానించింది.ఈ సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు యం.ఏ. గఫూర్‌, ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు హాజరయ్యారు.

Spread the love