దశాబ్ది ఉత్సవాల్లో, రైతు దినోత్సవం..

నవతెలంగాణ-రామారెడ్డి :  మండలంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, రైతు దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని రామారెడ్డి, అన్నారం, కన్నాపూర్, పోసానిపేట్ రైతు వేదికల పరిధిలో, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు వేదికలో ఎంపీపీ దశరథ్ రెడ్డి తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వం, రైతులకు చేసిన సంక్షేమ ఫలాలు, రైతు అభివృద్ధికి చేపట్టిన పథకాలపై రైతులకు వివరించారు. అనంతరం రైతు వేదిక పరిధిలో, రైతులకు సహాపంకి భోజనాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ముత్తినేని రవీందర్రావు, మండల రైతుబంధు అధ్యక్షులు నారాయణరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, రైతుబంధు జిల్లా డైరెక్టర్ కాసర్ల రాజేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు అధ్యక్షులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love