బీఆర్ఎస్ కార్యక్రమంలో రైతు దినోత్సవం..

– చాపల ఉమాదేవి చల్వాయి ఎంపీటీసీ

నవతెలంగాణ-గోవిందరావుపేట : రైతు దినోత్సవం పూర్తిగా బి ఆర్ ఎస్ పార్టీ కార్యక్రమంలో మారిందని చల్వాయి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చాపల ఉమాదేవి అన్నారు. శనివారం చల్వాయి గ్రామంలో ఉమాదేవి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీటీలను ఆహ్వానించకుండా సొంత పార్టీ కార్యక్రమంగా రైతు దినోత్సవం రైతు వేదికలో జరిగిందని అన్నారు. అధికారులకు కూడా ఇతర పార్టీ ఎంపీటీసీలను కానీ ప్రజా ప్రతినిధులను కానీ ఆహ్వానించాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా విధులు నిర్వర్తించడం దురదృష్టకరమని అన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు కూడా బి ఆర్ఎస్ పార్టీలో చేరిపోయారని అన్నారు. గ్రామంలోని రైతాంగమంతా ఇబ్బందుల్లో ఉంటే మహిళా సీఈఓ లతో స్త్రీ నిధి రుణాలు ఇవ్వము రైతు దినోత్సవం కు రాకపోతే అంటూ మహిళ సంఘాల సభ్యులకు వాట్సాప్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. దీనిని బట్టి ప్రజలకు అర్థమవుతుందని పరిస్థితి ఇలా ఉందనేది ప్రజలకు తెలిసిపోతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు అధికార పార్టీకి భక్తుల్లా కాకుండా అందరిని ప్రోటోకాల్ పాటిస్తూ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
Spread the love