– రైతు సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి పరమేశ్వర చారి
నవతెలంగాణ – వనపర్తి : వనపర్తి జిల్లాలో ఉండే ఫర్టిలైజర్ షాపులను అధికారులు పర్యవేక్షించాలని, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్షానికి రైతులు బలి అవుతున్నారని రైతు సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి పరమేశ్వర చారి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో ఉండే ఫర్టిలైజర్ షాప్ ల యజమానులు అధికారులు కుమ్ముక్కై కొన్ని ఫెర్టిలైజర్ షాప్ లలో పాత స్టాక్ ఉన్న పాత రేట్లకు ఫర్టిలైజర్ ఇవ్వకుండా పెరిగిన రేట్లకే అమ్ముతున్నారని పేర్కొన్నారు. అది కాకుండా ఫర్టిలైజర్ కోసం వెళ్లిన రైతులకు ఫర్టిలైజర్ తో పాటు న్యానొ యూరియా లిక్విడ్ దానితోపాటు గొలుకలు రైతులకు అవసరం లేకున్నా అంటగట్టి అమ్ముతున్నారని తెలిపారు.
కొన్ని మండలాలలో యూరియా యాప్ లో ఉదయం 6 గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు యూరియా స్టాకును యాప్ లో పెడతామని అధికారులు చెప్తున్నారని, కానీ ఆ టైం కు యాప్ ఓపెన్ కావడం లేదు అయినా నో స్టాక్ అని చూపిస్తున్నాయని, మండలాలకు వచ్చే యూరియా ఎక్కడ వెళుతున్నది చాలా మంది రైతులు చదువురాని వారు ఉన్నారన్నారు. యూరియా యాప్ లో బుక్ చేసుకోమంటే బుకింగ్ కాక స్టాక్ లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఫర్టిలైజర్ షాప్ ల వారి దగ్గర వస్తే ఈ పరిస్థితి అక్కడ యూరియా కోసం చూస్తే ఆ పరిస్థితి యూరియాకు ఉండే యాప్ ను ఎత్తివేయాలని రైతులకు యూరియా అందుబాటులో పెట్టాలని, ప్రతి ఫర్టిలైజర్ షాప్ ను అధికారులు సందర్శించి నాణ్యమైన ఫర్టిలైజర్ ను రైతులకు అందించే విధంగా చూడాలన్నారు. ఫర్టిలైజర్ రేట్లను బోర్డుపైన రాసే విధంగా చూడాలని లేనిపక్షంలో రైతులను పెద్ద ఎత్తున సమకూర్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు సింగాయిపల్లి, కురుమయ్య, ముత్యాలు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.



