రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

– పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి
– పండుగ వాతావరణంలో రైతు దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-పటాన్‌చెరు, జిన్నారం
రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణల మూలంగా నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా నిలుస్తోందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పటాన్‌ చెరు మండల పరిధిలోని పెద్ద కంజర్ల, నంది గామ, లక్డారం గ్రామాల పరిధిలోని రైతు వేదికల వద్ద, అలాగే మండల కేంద్రమైన జిన్నారం, సొలక్పల్లి గ్రామాల పరిధిలోని రైతు వేదికల వద్ద నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయా గ్రామాల రైతులు నిర్వహించిన ర్యాలీలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ప్రధానంగా రైతుబంధు, రైతు బీమా పథకాలు అన్నదాతకు ఆత్మబం ధువుగా నిలిచాయన్నారు. పంట పెట్టుబడి సమయ ంలో వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించకుండా ఎకరాకు పదివేల రూపాయల పెట్టుబడి సహాయం రైతన్నకు పెద్ద ఊరట ఇచ్చిందన్నారు. గుంట భూమి ఉన్న రైతు మరణిస్తే పెద్దకర్మ అయ్యే లోపు రూ.5 లక్షల బీమా సొమ్ము అందించడం మూలంగా రైతు కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికా కుండా ఉంటున్నదన్నారు. అంతేకాకుండా 24 గంటల ఉచిత కరెంటు, మద్దతు ధరతో ప్రభుత్వమే పంటలు కొను గోలు చేసి అన్నదాతకు అండగా నిలుస్తున్నదన్నారు. రైతన ్నకు పెద్ద కొడుకు వలె పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యవ ుంత్రి కేసీఆర్‌కు యావత్తు రైతాంగం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పటాన్‌చెరులో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ విజరు కుమార్‌, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగో పాల్‌ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకట్‌ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ కుమార్‌ గౌడ్‌, డిఆర్డిఏ పీడీ శ్రీనివాస రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చంద్రశేఖర్‌ రెడ్డి, తహసిల్దార్‌ పరమేశం, ఎంపీడీవో బన్సీలాల్‌, సీఐలు వేణుగోపాల్‌ రెడ్డి, వినాయక్‌ రెడ్డి, జిన్నారంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మెన్‌ కుం చాల ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత జిన్నారం వెంకటేశం గౌడ్‌ పటాన్చెరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, డీిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ సిహెచ్‌ శ్రీనివాసరావు, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు వెంకటేష్‌ గౌడ్‌, జిన్నారం మండల వ్యవసాయ అధికారి రవీంద్ర రవీంద్రనాథ్‌ రెడ్డి, జిన్నారం తాసిల్దార్‌ దశరథ్‌ సింగ్‌ రాథోడ్‌, ఎంపీడీవో రాములు, డీఈఓ నర్సింగ్‌రావు, ఏవోడి శ్రీనివాస్‌, జిన్నారం గ్రామపంచాయతీ సర్పంచ్‌ అంతరెడ్డి గారి లావణ్య శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love