మిరపలో వైరస్ తెగుళ్లు.. ఆందోళన రైతులు

– అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
నవతెలంగాణ -మల్హర్ రావు
మిరప పంట ప్రస్తుతం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా మిరప పంటను చీడపీడలు అసిస్తుండటంతో రైతులకు నిరాశ కలిగిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. మండలంలో తాడిచెర్ల, మల్లారం, పెద్దతూoడ్ల, కిషన్ రావుపల్లి, అడ్వాలపల్లి, దుబ్బపేట, ఆన్ సాన్ పల్లి,నాచారం గ్రామాల్లో  దాదాపు 6,560 ఎకరాల మిరప పంటలు వేసినట్లుగా సమాచారం
పైముడుత నివారణ…
పిప్రోనిల్ 5 శాతం, ఎస్ సి 2 మిల్లి లీటర్లకు లీటర్ నీటికి లేదా డైపెన్ దయురాన్ 50 శాతం 15 గ్రాములను లీటర్ నీటికి  కలిపి పిచికారీ చేయాలి.
లద్దే పురుగు నివారణకు…
నోవాల్యురన్ 0.75 మిల్లి లీటర్లను లీటర్ నీటికి లేదా స్ర్పెనో సాడ్ 0.25 మిల్లి లిటర్లను లీటర్ నిటికీ లేదా ఇమామేక్డిన్ బెంజోయెట్ 0.5 గ్రాములను లీటర్ నీటికి లేదా క్లోరాంటనీలిప్రోల్ 0.3 మిల్లి లిటర్లను లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి.
కింది ముడత నివారణకు…
నీటిలో కరిగే గంధకం 80శాతం, 3 గ్రాములను లీటర్ నీటికి లేదా స్ర్పెరో మేసిపెన్ 0.8 మిల్లి లిటర్లను లీటర్ నీటికి లేదా ప్రాపర్ గైట్ 57శాతం, 2మిల్లి లిటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Spread the love