ప్రయివేటు కాలేజీల ఫీజు దందా..!

– ఇష్టారాజ్యంగా నారాయణ విద్యా సంస్థల తీరు
– ఒక్క పర్మిషన్‌తో పదుల సంఖ్యలో కాలేజీల నిర్వహణ
– స్టార్‌, సూపర్‌ స్టార్‌, ఏసీ క్లాసులతో రూ.లక్షల్లో ఫీజులు వసూలు
– అధికారులకు ఫిర్యాదు చేసినా నో యాక్షన్‌
– చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నారాయణ వంటి కార్పొరేట్‌ కాలేజీలు తీరు తాము ఆడిందే ఆట.. పాడిందే పాట.. అనేలా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రుల అమాయకత్వాన్ని, నమ్మకాన్ని ఆసరగా చేసుకుని సొమ్ము చేసు కుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టా రీతిన వ్యవహరస్తున్నాయి. ఇరుకు గదుల్లో చదువులు చెబుతూ.. అడ్డగో లుగా రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ స్టూడెంట్స్‌ పేరెంట్స్‌ను పీల్చి పిప్పిచేస్తున్నాయి. కనీస సౌకర్యాలు ఉండవు. ప్రత్యేక తరగ తుల పేరిట రోజంతా బట్టి చదువులతో విద్యార్థులను మానసిక ఒత్తిడి గురి చేస్తున్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేని పిల్లలు తల్లిదం డ్రులకు భారం కావొద్దని భావించి ఆత్మహత్యలు ఒడిగడుతు న్నారు. ఇలాంటి ఘటనలో ఏడాదిలో ఎక్కడో ఒకచోట జరుగు తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. అందులో నారాయణ వంటి కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో జరిగితే అసలు పట్టించుకునే వారే లేకుండా పోయారు. విద్యాశాఖ, ఇంటర్‌ బోర్డుకి ఫిర్యాదు చేస్తే.. సంబంధిత అధికారులు వచ్చి.. చూసి వెళ్తారు తప్ప చర్యలు తీసుకోరని విద్యార్థి సంఘాలు నాయకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న నారాయణ వంటి కార్పొరేట్‌ కాలేజీల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
సర్కారు నిబంధనలకు.. ‘నారాయణ’ తూట్లు..
కాలేజీకి ఒకచోట పర్మిషన్‌ ఉంటే మరోచోట నిర్వహిస్తు న్నారు. నారాయణగూడలోని నారాయణ కాలేజీ పర్మిషన్‌తో సికింద్రాబాద్‌, జూబ్లిహిల్స్‌, మాదాపూర్‌లో బ్రాంచీలు నడుపుతు న్నారు. ఒక్క మాదాపూర్‌లో 30-40 కాలేజీలకు పర్మిషన్‌ లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆంటున్నారు. ఇలా నగరంలో ఒక్క నారాయణ విద్యాసంస్థలకు సంబంధించి 50 కాలేజీల వరకు పర్మిషన్‌ లేకుండానే రన్‌ చేస్తున్నాయని చెబుతున్నారు. వాస్త వానికి కాలేజీకి 8 వేల చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆటస ్థలం తప్పనిసరి. లేబొరేటరీతో పాటు సెక్షన్‌కు ఇద్దరు అధ్యాప కులుండాలి. 9 సెక్షన్లకు మించి ఉండకూడదు. ప్రతి సెక్షన్‌లో 88 సీట్లు అనుమతిస్తారు. భవనానికి ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్‌ ఉండాలి. ఎక్కడో ఒకచోట తప్పిస్తే.. ఇవేమి అమలు కావడం లేదు. నగరంలో కొత్త భవనం కనిపిస్తే చాలు.. నారాయణ బోర్డు పెట్టేస్తారు. నారాయణ కాలేజీకి ఇంటర్‌ బోర్డు నిబంధనల పట్ల పట్టింపులేదు. ఇష్టారాజ్యంగా అదనపు సెక్షన్లు పెట్టి నడిపిస్తారు. ప్రాక్టికల్స్‌ చేయించిన పాపాన పోవడం లేదు. సైన్స్‌ గ్రూపులతో పాటు, ఆర్ట్స్‌, కామర్స్‌ గ్రూపులూ ఉండాలి. కానీ కార్పొరేట్‌ కాలేజీల్లో అసలు గ్రూపులే ఉండటం లేదు. ప్రయివేటు జూని యర్‌ కాలేజీల ఫీజులపై కచ్చితమైన చట్టం లేకపోవడం కార్పొరేట్‌ కాలేజీల పాలిట వరంగా మారింది. ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌ అంటూ భారీ ఎత్తున ప్రచారంతో కాలేజీలు విద్యార్థులను ఆకర్షిస్తు న్నాయి. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తుపై ఆశతో అనేక కష్టాలు పడుతూ ఆయా కాలేజీల్లో చేర్పిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కాలేజీలు ఫీజులు పిండేస్తున్నాయి. నారాయణ వంటి కాలేజీలు స్టార్‌, సూపర్‌ స్టార్‌ పేరుతో రూ.లక్షల్లో ఫీజుల రూపంలో తల్లిదండ్రుల నుంచి వసూల చేస్తుండగా… ఏసీ పేరుతో రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కానీ రోజుకు గంట కూడా ఏడి ఉండదు. అందులో ఒక రోజు పనిచేస్తే.. మరో రోజు పనిచే యదు. ఇక బుక్స్‌ పేరిట ఏటా రూ.కోట్లు దుండుకుంటున్నారు. అరకొరగా ఉండే అధ్యాపక సిబ్బందికి అతి తక్కువ వేతనాలిస్తూ, ఫీజుల విషయంలో విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తూ అవ ూనవీయంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇక వసతుల విషయంలో పట్టింపు ఉండదని.. సరిపడ టాయిలెట్లు లేక అమ్మాయిల అవస్థలు వర్ణానానీతం. ఇక నిబంధనల ఉల్లంఘనపై అధికారులకు ఫిర్యాదు చేస్తే.. వస్తారు.. చూస్తారు.. వెళ్తారు. తప్ప యాక్షన్‌ ఉండదు. ఇలా అడుగడునా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న నారాయణ వంటి కాలేజీలపై విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు కఠినంగా వ్యవహరించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
పర్మిషన్‌ లేని కాలేజీల్లోనే విద్యార్థుల సూసైడ్‌
ఇంటర్‌ బోర్డు పర్మిషన్‌తోనే విద్యాసంస్థ లను నడుపుకోవాలి. పర్మిషన్‌ లేకుండా నడుపుతున్నారంటే ఇంటర్‌ బోర్డు అధికారు లు రూ. లక్షలు కార్పొరేట్‌ విద్యా సంస్థల దగ్గర తీసుకుంటున్నారు కాబట్టే ఆయా కార్పొరేట్‌ కాలేజీలు పేద, మధ్యతరగతి ప్రజ లను మోసం చేస్తూ.. అడ్డగోలుగా ఫీజులు దండుకుంటున్నారు. విద్యార్థుల సూసైడ్‌లకు ఇదే కారణం. ఇప్పటి వరకు సూసైడ్‌ చేసుకున్న దాదాపు 300 లకుపైగా విద్యార్థులు పర్మిషన్‌ లేని కాలేజీల్లోనే. వీటిని అధి కారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. నారాయణ వంటి కార్పొరేట్‌ సంస్థలతో పాటు పర్మిషన్‌ లేని కాలేజీలను సీజ్‌ చేయా లి. లేకుంటే రూ.లక్షల ఫీజు వసూళ్లు, అరాచకాలు, చావులు ఇలాగే కొనసాగుతాయి. అశోక్‌ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి.
కార్పొరేట్‌ కాలేజీల దోపీడీని అడ్డుకోవాలి
నారాయణ సంస్థలతోపాటు ఇతర కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఫీజుల కోసం విద్యార్థులను వేధించడం దారుణం. కొద్ది రోజుల క్రితం జరిగిన రామంతాపూర్‌ నారా యణ కాలేజీ వేధింపులు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చాయి. వేధింపులకు పాల్పడుతు న్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. వెంటనే ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు కార్పొరేట్‌ కాలేజీల దోపిడీని అడ్డుకోవాలి. జి.శ్యామ్‌, పీడీఎస్‌యూ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు.

Spread the love