Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీబీజీ రాంజీ పథకంలో ఉత్తమ ఉద్యోగులకు సన్మానం

వీబీజీ రాంజీ పథకంలో ఉత్తమ ఉద్యోగులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
వీబీజీ రాంజీ పథకం అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను మండల పరిషత్ అధికారులు బుధవారం ఘనంగా సన్మానించారు. పరకాల మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల పరిషత్ ఇన్‌ఛార్జి అభివృద్ధి అధికారి రామకృష్ణ, ఏపీవో ఇందిర పాల్గొని ఉత్తమ ఉద్యోగులను అభినందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, అత్యధిక పనిదినాలను నమోదు చేయడంలో కృషి చేసిన ఉద్యోగులను గుర్తించి వారికి శాలువాలతో సన్మానం చేశారు. సన్మానం అందుకున్న వారిలో నాగారం గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం కోమల, కార్యదర్శి కిరణ్, టెక్నికల్ అసిస్టెంట్ సుమలత, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీకాంత్ ఉన్నారు. అలాగే లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ మొగిలిలకు ఉత్తమ ఉద్యోగి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపరింటెండెంట్, పలు గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -