– డిఈఓ మల్లికార్జున్
నవతెలంగాణ – కామారెడ్డి
తరగతి విద్యా బోధనలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జిల్లా స్థాయి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధ, ఐసీటీ తదితర అంశాలలో ఉపాధ్యాయులు ప్రావీణ్యం సంపాదించాలని కోరారు.
ఈ నెలలో జిల్లాలోని అందరూ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణ అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆధునిక బోధన పద్ధతులు అవలంబిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన కోరారు.మొదటి విడత గా కామారెడ్డి లో భౌతిక శాస్త్రం , గర్గుల పాఠశాలలో హిందీ, సదాశివనగర్. మోడల్ స్కూల్ లో ఇంగ్లీష్ జిల్లా స్థాయి శిక్షణలు జరుగుతున్నాయి ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్, స్థానిక ప్రధానోపాధ్యాయురాలు మాధవి, రిసోర్స్ పర్సన్ లు గోవింద్, రాజు, గౌడ్ ,రమేష్ గౌడ్, బాలగంగాధర్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



