Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైఎస్‌ఆర్ కు నివాళులర్పించిన పరకాల నేతలు

వైఎస్‌ఆర్ కు నివాళులర్పించిన పరకాల నేతలు

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలు కడప జిల్లా ఇడుపులపాయలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్మృతి వనం వద్ద ఉన్న ఆయన సమాధికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాధి వద్ద వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరకాల నుండి టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ మడికొండ శ్రీను, కాంగ్రెస్ నాయకులు అముదాలపల్లి మల్లేశం గౌడ్, బొజ్జం సాయి కుమార్ తదితరులు హాజరయ్యారు. ప్రజా సంక్షేమ పథకాల సారథిగా, పేద ప్రజల పక్షపాతిగా వైఎస్‌సార్‌ను వారు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -