Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్10న విద్యాసంస్థల బంద్: ఎస్ఎఫ్ఐ

10న విద్యాసంస్థల బంద్: ఎస్ఎఫ్ఐ

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ బడుల మూసివేతను నిరసిస్తూ ఈ నెల 10న చేపట్టనున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ పిలుపునిచ్చింది. పరకాల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకపోవడం దారుణమని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే, విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని వారు కోరారు. విద్యా రంగాన్ని కాపాడుకునేందుకు ఈ నెల 10న నిర్వహించనున్న బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -