Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడి పిల్లల కుటుంబాలకు ప్రాధాన్యత

ప్రభుత్వ బడి పిల్లల కుటుంబాలకు ప్రాధాన్యత

- Advertisement -
  • మొదటి ప్రాధాన్యత కార్డుల పంపిణిలో సర్పంచ్ సతీశ్
    నవతెలంగాణ-బెజ్జంకి
  • ప్రభుత్వ బడిలో విద్యనభ్యసిస్తున్న పిల్లల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పంచాయతీ పాలకవర్గం మొదటి ప్రాధాన్యతిస్తోందని సర్పంచ్ చిలుముల సతీశ్ అన్నారు.బుధవారం మండల పరిధిలోని వీరాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ సతీశ్ ప్రభుత్వ బడిలో విద్యనభ్యసిస్తున్న పిల్లల కుటుంబ సభ్యులకు మొదటి ప్రాధాన్యత కార్డులను పంపిణి చేశారు.వార్డు సభ్యులు పాల్గొన్నారు.

నిర్ణయం చారిత్రాత్మకం..
ప్రభుత్వ బడుల పరిరక్షణకు వీరాపూర్ పంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని మండలంలోని పలువురు విద్యావేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.ప్రభుత్వ బడిలో చదివే పిల్లల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రత్యేక గుర్తింపు కార్డులను పంపిణి చేయడం సర్పంచ్ సతీశ్ సాహోసపేతమైన నిర్ణయంగా పలువురు రాజకీయ పార్టీల నాయకులు అభివర్ణించారు.తల్లిదండ్రులు తమ పిల్లల చదువులకు ప్రభుత్వ బడిలో చెర్పించేందుకు నిరుత్సాహం చూపుతున్న తరుణంలో..పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వ ఉద్యోగానికి పరితపిస్తున్నారు.

ప్రభుత్వ బడిలో విద్యనభ్యసిస్తున్న పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యత కల్పించేల ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తేనే..ప్రభుత్వ బడులు బలోపేతమై పీజుల పేరుతో ప్రయివేట్ పాఠశాలల దోపిడికి చరమగీతం పాడవచ్చుననే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.మండలంలోని ఇతర గ్రామాలు వీరాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యుల నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తే ప్రభుత్వ బడులు మళ్లీ బలోపేతమయ్యే అవకాశాలు లేకపోలేదని పలువురు ప్రభుత్వోపాధ్యాయులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -