- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం దృష్ట్యా పిల్లలకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. అలాగే స్కూల్లో సమస్యల గురించి ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్యను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు ఉన్నారు.
- Advertisement -



