Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫీజు బకాయిలు విడుదలచేసే వరకు పోరాటం :బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌‌రావు

ఫీజు బకాయిలు విడుదలచేసే వరకు పోరాటం :బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌‌రావు

- Advertisement -

ముగిసిన నిరాహారదీక్ష
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

​విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌‌మెంట్‌ ‌బకాయిలు విడుదల చేసేదాకా తమ పోరాటం ఆగదని బీజేపీ అధ్యక్షులు ఎన్‌ ‌రాంచందర్‌‌రావు చెప్పారు. ‘ఫీజు బకాయి….బీజేపీ లడాయి’ పేరిట రెండు రోజులపాటు ఆయన నిరహార దీక్ష చేపట్టారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించడం, వైద్యుల హెచ్చరికలు, ముఖ్య నాయకుల ఒత్తిడితో దీక్ష విరమించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నిరంకుశ ఆంక్షలను బద్దలుకొడుతూ దీక్షను విజయవంతం చేశారని తెలిపారు. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం కదం తొక్కిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రూ. 15వేల కోట్ల బకాయిలు విడుదల చేసే వరకు కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటం ఆగదని చెప్పారు. దీక్షా శిబిరంలో ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌‌తోపాటు ఇతర ముఖ్య నేతలు రాంచందర్ రావుకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్ధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -