Monday, August 31, 2026
E-PAPER
Homeసినిమాన్యాయం కోసం పోరాటం

న్యాయం కోసం పోరాటం

- Advertisement -

జంగ్లీ పిక్చర్స్, డాక్టర్ జయంతీలాల్ గడా (పెన్ స్టూడియోస్) సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా‘డాయ్‌రా’. కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈనెల 18న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘డాయ్‌రా’ కథ.. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం, ఆగ్రహానికి కారణమైన ఓ నేరం తర్వాత చోటుచేసుకునే పరిణామాల చుట్టూ సాగుతుంది. ఆ నేరానికి సంబంధించిన నిజాలను వెలికితీసే క్రమంలో రెండు వేర్వేరు దర్యాప్తులు ప్రారంభమవుతాయి.
ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సంద‌ర్భంగా కరీనా కపూర్ ఖాన్ మాట్లాడుతూ, ‘మేఘనాతో కలిసి పనిచేసే క్ర‌మంలో.. ఒక పాత్ర గురించి మనకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా ఆమె ప్రశ్నించేలా చేస్తుంది. ప్రతి చిన్న విష‌యం వెనుక ఎంతో ఆలోచన ఉంటుంది. అయితే నటిగా మన సహజమైన భావోద్వేగాలను ఆమె ఎప్పుడూ దూరం చేయదు. ఇందులో నేను చేసిన డీసీపీ అజూనీ కోహ్లీ పాత్ర నా మనసులో చాలా కాలం నిలిచిపోతుంది. ఎందుకంటే నన్ను నేను పెద్ద‌గా అన్వేషించని ఒక కొత్త కోణంలోకి ఈ పాత్ర నన్ను తీసుకెళ్లింది’ అని అన్నారు. “డీసీపీ రామన్ కుమార్ పాత్రలోని సంక్లిష్టతే నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. బయటకు చాలా ప్రశాంతంగా కనిపించే ఈ పాత్రలో లోపల ఎన్నో భావోద్వేగాలు, సంఘర్షణలు ఉన్నాయి’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -