Monday, August 31, 2026
E-PAPER
Homeసినిమాగ్రామీణ నేపథ్యంలో సాగే ‘వేట’

గ్రామీణ నేపథ్యంలో సాగే ‘వేట’

- Advertisement -

ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేట’. సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సోమవారం ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఈ పూజా కార్యక్రమాలకు కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అంద జేయగా, కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మెహర్ రమేష్, యదు వంశీ, అనుదీప్ దేవ్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో
హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ,‘‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను. ‘వేట’ అనేది చిరంజీవి టైటిల్. మా కథకి ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది. మా సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
‘ఇదే నా మొదటి సినిమా. కథ చెప్పిన వెంటనే కేఎస్ రవి కుమార్ అంగీకరించారు. ఈ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఈటీవీ విన్ టీంకు థాంక్స్’ అని దర్శకుడు అశోక్ కోటిపల్లి చెప్పారు.
నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ,‘‘ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్. కేఎస్ రవి కుమార్ మా సినిమాలో గొప్ప పాత్రను పోషించనున్నారు. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్న కల్కి రాజాకి, నిహారికకి థాంక్స్. ‘కమిటీకుర్రోళ్లు’ చిత్రంలానే ఇది కూడా ఓ గ్రామీణ కథ. అశోక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సినిమా ఎంతో సహజంగా ఉంటూనే కమర్షియల్ పంథాలో ఉంటుంది’ అని తెలిపారు.
‘ఈ సినిమా నా కెరీర్‌లో గొప్ప ప్రారంభంగా మారుతుందని ఆశిస్తున్నాను’ అని సాత్విక చెప్పారు.
కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ,‘ ‘డైరెక్టర్ అశోక్ చెప్పిన కథ నాకు అద్బుతంగా అనిపించింది. అందరూ కొత్త వాళ్లు కలిసి పని చేస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో ఊర్లో పెద రాయుడు టైపు పాత్ర నాది. నా క్యారెక్టర్ నాకు నచ్చింది. జెన్ జీ ఆడియెన్స్‌కి కూడా ఈ సినిమా నచ్చుతుంది’ అని అన్నారు.
ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్: అశోక్ కోటిపల్లి,
ఈటివి విన్ వైస్-ప్రెసిడెంట్: సాయి కృష్ణ కోయిన్ని, లైన్ ప్రొడ్యూసర్: కల్కి రాజా తెలగారెడ్డి, కంటెంట్ హెడ్ (ఈటివి విన్): భరణ్ దండమూడి, క్రియేటివ్ ప్రొడ్యూసర్(ఈటివి విన్): తన్మయ్ ఎన్, డి. ఓ.పి: వాజిద్ బేగ్, మ్యూజిక్: చైతన్ భరద్వాజ, ఫైట్స్: ఏ. విజయ్, ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే, ఎడిటర్: రాఘవేంద్ర తిరుణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాగం సత్య నితేష్, శివ కుమార్ మచ్చా(ఈటివి విన్), కొరియోగ్రాఫర్: జేడీ మాస్టర్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -