భాదిత స్నేహితునికి ఫ్రెండ్స్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం

నవతెలంగాణ – ఏర్గట్ల
పోచంపాడ్ గ్రామానికి చెందిన 1999-2000 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థి ఇస్మాయిల్ అనే వ్యక్తికి ఆక్సిడెంట్ అవ్వడంతో తాళ్ళ రాంపూర్ కు చెందిన 1999-2000 బ్యాచ్ విద్యార్థులు ఆపన్న హస్తం అందించారు. తమ వంతుగా వారు తయారు చేసుకున్న ప్రెండ్స్ హోప్ ఫౌండేషన్ ద్వారా 31 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పోచంపాడ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకుని,తిరిగి ఎవరి ఇండ్లకు వారు వెళ్ళే సమయంలో, ఇస్మాయిల్ అనే పూర్వ విద్యార్థికి ఆక్సిడెంట్ అయ్యిందని ,ఆసుపత్రిలో జాయిన్ చేస్తే వైద్యులు అతనికి బ్రెయిన్  సర్జరీ చేయాలన్నారని మాకు తెలియడంతో,మా వంతుగా మేము 31 వేల రూపాయలు వైద్య సహాయం కోసం అందించామని అన్నారు.ఇంకా ఎవరైనా సహాయం చేయాలనుకునే వారు 7036383857 నంబర్ కు గూగుల్ పే గాని ఫోన్ పే ద్వారా గాని ఆర్థిక సహాయం అందించి ఇస్మాయిల్ ప్రాణాలు కాపాడాలని కోరారు.
Spread the love