నిజామాబాద్‌ సెగ్మెంట్‌తో సహా 10సీట్లు గెలుస్తున్నాం: బాజిరెడ్డి గోవర్ధన్ 

– కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అబద్ధపు మాటలు చెప్పి ఓట్ల దండుకునేలా చూస్తున్నారు
– రేవంత్ రెడ్డి జూటకోర్
– ప్రజలే వీరికి తగిన బుద్ధి చెబుతారు
– కమలం పువ్వు చెవిలో, కాంగ్రెస్ చెయ్యి నెత్తిన పెట్టి ప్రజలను నిండాముంచాలని చూస్తున్నారు
– ఎంపీ ఎలక్షన్‌లో గెలిస్తేనే కేసీఆర్‌కి బలం
– కేంద్రంలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉంది
– బీజేపీని కొట్టేది బీఆర్‌ఎస్‌ ఒక్కటే
– మన బ్రతుకులు మారాలంటే బీఆర్‌ఎస్‌ రావాలి
– పాత కలెక్టరేట్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ 
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ సెగ్మెంట్ తో సహా 10 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అబద్ధపు మాటలు చెప్పి ఓట్లు దన్నుకునేలా చూస్తున్నారని బీఆర్ఎస్ ప్రస్తుత ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి పెద్ద జూటకోరని ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ పాత కలెక్టరేట్ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులను ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఇంతకుముందు జిల్లాకు ఎంపీగా ఉన్నాడు. ప్రజలకు హామీ ఇచ్చాడు పసుపు బోర్డు తెస్తానని..ఇప్పటికి నెరవేర్చలేదు.. ప్రజలు గమనిస్తున్నారు.. ప్రొద్దున లేస్తే పాకిస్తాన్, ఇండియా, హిందూ, ముస్లిం, రోహిన్యా, బంగ్లాదేశ్, వాక్యానించడమే తప్ప ప్రజలకు చేసింది శూన్యం. రామ నామం పేరు చెప్పుకొని రాజకీయం చేయడం తప్ప ప్రజలకు మేలుచేసింది శూన్యం మనమందరం రాముని కొలుస్తాం రాజ్యం కోసం రాముడు ఏం చేశాడో తెలుసుకొని రాముని యొక్క ఆచరణలు అవలంబించాలి.. రాముడు గురించి తెలుసా.. బీజేపీ నాయకులకు.. రాముడు మంచి తండ్రి. ఒక అన్న, ఒక భర్త, ఒక పరిపాలకుడు, మహా పురుషుడు రాముడు యొక్క లక్షణాలు… కానీ మోడీ ప్రభుత్వం.. ధనవంతులకు, ఇంకా ధనవంతుల్నిగా మారుస్తుంది, పేదవాడు పేదవాడిగానే మిగులుతున్నాడు. రూ.15 లక్షలు ఇస్తానన్నాడు. ఒక్కొక్కరికి నల్లధనాన్ని వెలికి తీస్తానన్నాడు. ఎక్కడ.. దేశంలో ఎక్కడా లేదు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఎంపీలు ఉండటం జిల్లా ప్రజలకు చేసింది శూన్యం.
ఐదు సంవత్సరాలు సమయాన్ని వృధా చేసిన ఎంపి అరవింద్ మరియు అతని తండ్రి… ఇలాంటి వ్యక్తులకు.. ఎంపీ ఎలక్షన్లో.. మోడీని అడ్డం పెట్టుకొని.. ఓట్లు దండుకోవడానికి ప్రచారం చేస్తున్నాడు.. దేశంలో ఎక్కడ లేదు ఎంపీ గానీ గ్రామాల్లోకి వస్తే తరమింది… కానీ మన ఎంపీ ని గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టారు..కారణం అబద్దం మాటలు చెప్పడం.. గ్రామాలకు చేసింది శూన్యం.. అందుకని ప్రజలు తిరగబడ్డారు..కావున ప్రజలారా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్పాలి అని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగస్తుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నుకొని జిల్లాకు ఉద్యోగస్తులకు చేసింది ఏంది అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలో ఏ ఒక్కనాడు అయినా మన గ్రామాలకు మంచి చెడుకు వచ్చాడా.. ఐదేళ్లు ఎమ్మెల్సీగా ఉండి చేయలేదు ఇప్పుడు ఎంపీగా ఏం చేస్తాడో చెప్పాలి. రేవంత్ రెడ్డి జూట కోర్ 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పూటకు ఒక మాట.. మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ..ప్రభుత్వం ఏర్పడంగనే రుణమాఫీ చేస్తానన్నావు.. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 135 రోజులు గడుస్తున్న రుణమాఫీ లేదు… మళ్లీ ఆగస్టు 15.. చేస్తానని మల్లోసారి అబద్ధం ప్రచార మోసపూరిత మాటలు.. చెప్తున్నాడు.. ఈ యొక్క మోసపూరిత మాటలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అబద్ధపు మాటలు చెప్పి ఓట్ల దండుకునేలా చూస్తున్నారు. వారి మోసపూరిత మాటలు నమ్మకండని బీఅర్ ఎస్ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
ప్రజలు 40 సంవత్సరాలు నుండి నన్ను ఆదరిస్తున్నారు కాబట్టే రాజకీయంలో రాణిస్తున్నాను.. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో నిజామాబాద్ ప్రజలు ఆదరిస్తారని. టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆయన ఆశిస్తున్నారు అని తెలిపారు.ఈసారి ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిపిస్తే.. నిజామాబాద్ రూపు రేఖల్ని మార్చేస్తా.. పార్లమెంట్లో కొట్లాడి.. నిజామాబాద్ జిల్లాకు నిధులు తీసుకువస్తా… ఏదైతే ఆర్మూర్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కోట్లాడి ఆర్మూర్ కు లిఫ్ట్ ఇరిగేషన్.. బైపాస్ రోడ్లు హైవే బ్రిడ్జిలు  తీసుకొచ్చిన ఘనత నాకు ఉందని ఆయన గుర్తు చేశారు. అదే పోరాటం అదే స్ఫూర్తి నాలో ఇంకా ఉందని ఆయన గుర్తు చేశారు.కావున వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించండి సేవకుడిగా పని చేస్తా నిజామాబాద్ జిల్లాలో ఏవైతే పెండింగ్ లో ఉన్న పనులన్నీ తొందరగా కంప్లీట్ చేస్తాను అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్,శ్రీనివాస్ గౌడ్,మహముద్, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి   బాల్కొండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ , కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ,కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా , ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎల్ రమణ, జడ్పీ చైర్మన్ విట్టల్ రావు,  బోధన్ మాజీ శాసన సభ్యులు  షకీల్ ఆమెర్ సతీమణి అయేష సుల్తానా , జగిత్యాల జడ్పీ చైర్మన్  దావ వసంత, ప్రభాకర్ రెడ్డి నూడా అలీం, ఎల్ ఎం బి రాజేశ్వర్,లోక బాపు రెడ్డి, జిల్లా యువ నాయకులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ , నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి జడ్పిటిసిలు, ఎంపీపీలు, పిఎసిఎస్ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు, మండలల అధ్యక్షులు, ఎంపిటిసిలు, సర్పంచులు, ఉపసర్పంచులు, బిఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల యువజన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Spread the love