– సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం
నవతెలంగాణ-కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాస్‌పోర్ట్ కార్యాలయంలో శని వారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఉదయం ఏడు న్నర గంటల సమయంలో కార్యా లయం నుంచి పొగలు రావడంతో వాచ్‌మెన్ అప్రమత్తమై డోర్ ఓపెన్ చేసి చూడగా మంటలు కనిపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. మంటలను అదుపు లోకి తెచ్చారు. కార్యాలయంలో గల కంప్యూటర్లు, బ్యాటరీలు, ప్రింటర్స్, కుర్చీలు, పేపర్స్ తదితర వస్తువులు కాలిపోయాయి. పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన ఏ ఒక్క డాటా మిస్ కాలేదని, అభ్యర్థి ఉండ గానే వారి పాస్‌పోర్ట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్ చేసి, అతని ఫైల్ అందజేస్తామని పోస్టాఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. కాగా, ఈ కార్యాలయం ఫిబ్రవరి 20, 2019న ప్రారంభమైంది. సుమారు. రూ.20లక్షల వరకు నష్టం జరిగినట్టు సమాచారం.