సచివాలయం సమీపంలో అగ్నిప్రమాదం

నవతెలంగాణ-హైదరాబాద్ : మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మణిపూర్ సెక్రటేరియట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ అధికారిక బంగ్లాకు కొన్ని వందల మీటర్ల దూరంలో ఓ బంగ్లా ఉంది. అందులో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న నాలుగు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు, మంటలు చెరిగిన భవనంలో కుకీ తెగకు చెందిన ప్రధాన కార్యాలయం ఉంది. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో మైతేయి, కుకీ వర్గం మధ్య హింస చెలరేగిన వారం రోజుల్లోనే అగ్నిప్రమాదం జరగడం గమనార్హం.

Spread the love