Thursday, July 9, 2026
E-PAPER
Homeజాతీయంకొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి

కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి

- Advertisement -

పలువురి గల్లంతు
కేరళంలోని వాయనాడ్‌ ‌జిల్లా మీనాక్ష‍ి వంతెన సమీపంలో ఘటన
ప్రమాదంపై స్పందించిన కేరళం సీఎం వి.డి. సతీశన్‌
యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరావాస చర్యలు

తిరువనంతపురం :భారీ వర్షాలకు కేరళంలోని వాయనాడ్‌ ‌జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో మట్టి కింద కూరుకుపోయిన ఆరుగురిని స్థానికులు రక్షించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మరికొంతమంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మలప్పురం, వాయనాడ్‌ ‌ జిల్లాలను కలిపే సొరంగ మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న మీనాక్షి వంతెన సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాలి : కేరళం సీఎం వి.డి. సతీశన్‌
‌కొండచరియలు విరిగి పడిన ప్రమాదంపై కేరళం ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ స్పందించారు. జిల్లా మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరావాస చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. అదే విధంగా వాయనాడ్‌ ‌కు వెళ్లి సహాయక, పునరావాస చర్యలను పర్యవేక్షించాలని మంత్రులు అనిల్ కుమార్, సిద్ధిక్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉన్నతాధికారులు అగ్నిమాపక, పోలీసు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలను రంగంలోకి దింపి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వాయనాడ్‌ ‌లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో అదే రోజు నుంచి సొరంగం పనులను ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో సుమారు 265 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. సొరంగ మార్గం ప్రాజెక్టు నిర్మాణంలో పని చేసే కార్మికులు నివసించే వసతి గృహంపైనా కొండచరియలు విరిగి పడ్డాయి. అలాగే, కొన్ని నివాస గృహాలు, హోమ్‌స్టేలపైనా భారీగా మట్టి, రాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. మరోవైపు శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు, స్థానికులు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -