Tuesday, August 11, 2026
E-PAPER
Homeమానవిమొటిమలు మచ్చలకు..

మొటిమలు మచ్చలకు..

- Advertisement -

తులసి మన ఆరోగ్యాన్ని సంరక్ష‍ించడానికే కాదు.. మన సౌందర్య సంరక్షణలోనూ సహాయపడుతుంది. తులసిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మన చర్మ సంరక్షణకు సహాయపడతాయి. మరి మొటిమలు, డార్క్ స్పాట్స్ కోసం తులసితో ఎలాంటి ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు? అవి చర్మానికి ఎలా ఉపయోగపడతాయి? చూద్దాం.

తులసి, పాలు ఫేస్‌ ప్యాక్‌
ఒక బౌల్‌లో టేబుల్ స్పూన్ తులసి పొడి, 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసి పేస్ట్‌లా చేసి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయిండి. దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్‌ చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి, మొటిమల సమస్యతో బాధపడుతున్నవారికి ఈ ప్యాక్‌ చాలా బాగా పనిచేస్తుంది.

వేప, తులసి ఫేస్ ప్యాక్‌
నిరంతరం మొటిమలు, మచ్చలు, నిర్జీవమైన చర్మంతో బాధపడుతుంటే తులసి, వేప ఫేస్ ప్యాక్ మీకు ఎంతో సహాయపడుతుంది. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల తులసి పొడి తీసుకుని కొన్ని వేప ఆకులను కలపండి. మెత్తని పేస్ట్ లాగా అయ్యేవరకు రెండింటినీ మిక్సీలో వేసి పేస్ట్‌ చేయండి. తరువాత 2 లవంగాలను వేసి మళ్లీ పేస్ట్‌లా చేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10-15 నిమిషాల పాటు ఆరనివ్వంది. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.

తులసి, కలబంద ప్యాక్‌
ఈ రెండింటిలోని యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఒక గిన్నె తీసుకుని, అందులో 2 టేబుల్ స్పూన్ల తులసి పొడితో పాటు 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును కలపండి. అవసరమైతే, పేస్ట్ లాంటి చిక్కదనం కోసం నీళ్ళు కలపండి. మెత్తని పేస్ట్ తయారయ్యాక, దానిని ముఖానికి రాసుకుని 10-15 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

తులసి + పసుపు ఫేస్‌ ప్యాక్‌
ఇది ముఖంపై ఉన్న మచ్చలను, మొటిమల మచ్చలు తొలగిస్తుంది. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల తులసి పొడి, పావు (1/4) టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి. అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్కలిపి, ఆ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని 10-15 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -