Friday, August 14, 2026
E-PAPER
Homeమానవిచుండ్రు సమస్యకు…

చుండ్రు సమస్యకు…

- Advertisement -

వర్షాకాలంలో అధిక తేమ కారణంగా జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. జుట్టు నుంచి అదనపు నూనె, ధూళి, మృతకణాలను తొలగించడానికి తేలికపాటి షాంపూతో వారానికి కనీసం మూడు నుంచి నాలుగుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే తల శుభ్రంగా ఉంటుంది. చుండ్ర సమస్య వచ్చే అవకాశం ఉంది. చుండ్రు సమస్య ఉన్నవారికి త్వరగా తగ్గుతుంది. తలస్నానం చేసేటప్పుడు షాంపూ వ్యర్థాలూ, మృతకణాలు, చుండ్రు వంటివి తల్లో పేరుకోకుండా దువ్వెన లేదా బ్రష్‌తో రుద్దితే సరి. ఇవి తొలగిపోతాయి. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. మీ హెయిర్ బ్రష్‌లు, దువ్వెనలు, ఇతర జుట్టు ఉపకరణాలను శుభ్రంగా ఉంచండి.

కఠినమైన షాంపూలు వాడొద్దు..
తలస్నానానికి కేవలం తేలికపాటి షాంపూ మాత్రమే వాడాలి. కఠినమైన షాంపూలు తలలోని సహజ నూనెలను తొలగించి, చుండ్రు సమస్యను తీవ్రం చేస్తాయి.

సరిగ్గా ఆరనివ్వండి..
వర్షంలో తడిచినప్పుడు జుట్టు పూర్తిగా ఆరనివ్వండి. మరుసటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయండి. తర్వాత కుదుళ్ల నుంచి చివర్ల వరకూ కండిషనర్‌ రాయండి. అప్పుడే జుట్టు పొడారకుండా తేమ సమన్వయం చేస్తుంది. అలానే, మాడుపై జిడ్డును పెంచే జెల్‌, వ్యాక్స్‌ వంటివి ఈ కాలంలో వాడకపోవడమే మంచిది.

మసాజ్‌ చేయండి..
షాంపూతో తలస్నానం చేసే ముందు, మీ స్కాల్ప్‌ను మీ చేతివేళ్లతో సున్నితంగా మసాజ్ చేయండి. ఇది చుండ్రును మరింత ప్రభావవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది.

ఈ టిప్‌ ఫాలో అవ్వండి..
గిన్నెలో నీళ్లు పోసి అందులో కొన్ని వేపాకులు వేసి అవి పూర్తిగా రంగు మారేంత వరకు మరగబెట్టాలి. అనంతరం ఆ నీటిని బాగా చల్లారనిచ్చి వేపాకులను వేరుచేయాలి. షాంపూ చేసుకున్న అనంతరం ఈ నీటితో కుదుళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.

ఈ ప్యాక్‌తో..
రాత్రంతా నానబెట్టిన మెంతులకు కొన్ని వేపాకులు జోడించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనికి కొద్దిగా పెరుగుని సైతం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా వేసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -