
నవతెలంగాణ-గోవిందరావుపేట
అడవి జీవితంలో ఆదివాసి జీవనం అని ప్రధానోపాధ్యాయులు కల్తీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కర్లపల్లి లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ.కల్తి. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలను కలిగి వెనుకబాటు తనము, అడవి జీవితం పేదరికం కలిగి ఉన్నటువంటి ఆదివాసీల కొరకు ఐక్యరాజ్య సమితి ఆగస్టు9 ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఏర్పాటు చేయడం గర్వాంగా వుందన్నారు తదుపరి ఆదివాసీ వీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈకార్యక్రమంలో ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.