డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కు దరఖాస్తు చేసుకున్న మాజీ  ఎమ్మెల్యే..

– మెచ్చా హయాం లోనే ఆర్టీవో సబ్ యూనిట్ ఏర్పాటు..
– కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం గురువారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని ఆర్టీవో సబ్ యూనిట్ కు వచ్చారు. ఈ యూనిట్ తన హయాంలో నే ఏర్పాటు చేస్తానని ఆనందం వ్యక్తం చేసారు. అశ్వారావుపేట,దమ్మపేట మండలాల ప్రజలు కొత్త వాహనం కొనుగోలు చేసినా,రిజిస్ట్రేషన్ కు,నూతన డ్రైవింగ్ లైసెన్స్,లైసెన్స్ రెన్యువల్ కు,వాహనం రిజిస్ట్రేషన్ బదిలీ కోసం ఇదివరకు 100 కి.మీ దూరం లోని జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెం వెళ్ళాల్సి వచ్చేది అని గుర్తు చేసారు.వాహన వినియోగదారులు ఇబ్బందుల దృష్ట్యా నాటి మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్ తో చర్చించి నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట ఈ సబ్ యూనిట్ కార్యాలయాన్ని మంజూరు చేయించామని,ఇందుకోసం  నాటి  మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి మరువలేనిదని.ఆయనే ప్రారంభించారు అన్నారు. ఈ సందర్భంగా  వినియోగదారులు కొందరు మెచ్చా నాగేశ్వరరావు తో మాట్లాడుతూ  ఒకప్పుడు ఈ పని కోసం ఎంతో దూరం ప్రయాణం చేసి తీరా వెళ్ళాక అక్కడ పని జరగకపోతే మళ్ళీ వచ్చి మరొక రోజు వెళ్ళాల్సి వచ్చేదని,తమరు చలువ తో సబ్ యూనిట్ కార్యాలయం మంజూరు చేయించడం ఈ రోజు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.ఐ వెలసిరి వెంకట రమణ,సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love