Monday, August 10, 2026
E-PAPER
Homeఖమ్మంపెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటి

పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటి

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
నల్లబెల్లి మండల కేంద్రంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనంతరం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌), మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావులను తాటి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దాస్యం వినయ్‌ భాస్కర్, బీఆర్‌ఎస్‌ ములుగు మాజీ జిల్లా అధ్యక్షుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ బైటి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -