పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సోదరి మృతి

నవతెలంగాణ – పాకిస్థాన్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన సోదరి మరణించినట్లు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Spread the love