ధోనీకి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్న మహీకి ఇతర క్రీడల్లోనూ ప్రవేశం ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ గోల్ఫ్ ఆడాడు. అది కూడా ఎవరితో తెలుసా..? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో. వీరిద్దరూ కలిసి గోల్ఫ్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ధోనీ.. కార్లోస్ అల్కరాజ్, అలెగ్జాండర్ జ్వెరేవ్ మధ్య జరిగిన యూఎస్ ఓపెన్‌ క్వారర్ట్ ఫైనల్స్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు. అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దగ్గర్నుంచి ధోనీకి ఆహ్వానం లభించింది. ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ బెడ్మినస్టర్‌లో ధోనీ, ట్రంప్ గోల్ఫ్ ఆడారు.

Spread the love