గ్రూప్‌-2పై ఉచిత అవగాహన సదస్సు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో నిర్వహించబోయే గ్రూప్‌-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం అమిగోస్‌ 21వ సెంచరీ ఐఏఎస్‌ అకాడమి ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ అకాడమి అకడమిక్‌ డైరెక్టర్‌ జనార్ధన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీపీఎస్సీ కొత్త సిలబస్‌పై వర్క్‌షాప్‌, ప్రిలిమ్స్‌ ఉచిత మాక్‌ టెస్ట్‌ ఈనెల 16న ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో తమ అకాడమిలో నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో గ్రూప్‌-2 కొత్త సిలబస్‌, సన్నద్ధత ప్రణాళిక, నోట్సు మేకింగ్‌, సమయపాలన వంటి అంశాలపై సీనియర్‌ అధ్యాపకులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. మాక్‌ టెస్టు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని వివరించారు.

Spread the love