ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత

– 15న బ్రిస్బేన్‌లో, 16న అక్లాండ్‌లో బోనాల పండుగ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లారు. ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ”భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో గాయత్రి మందిరంలో బోనాలు సంబరాలు జరగనున్నాయి. ఆ వేడుకలలో ప్రవాస భారతీయులతో పాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. 16న న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ నగరంలో గణేష్‌టెంపుల్‌లో జరగనున్న బోనాలు వేడుకలో పాల్గొంటారు.

Spread the love