నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈనెల 16 నుంచి టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో చేపట్టబోయే పాత పెన్షన్ సాధన సంకల్పయాత్రకు టీఎస్టీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, కర్నాటక మాదిరిగా తెలంగాణలోనూ సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2004 తర్వాత నియమించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు.