సిరి వేణి కుంట గ్రామంలో ఉచిత వైద్య శిబిరం..

Free medical camp in Siri Veni Kunta village..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి మండలంలోని సిరివేణికుంట గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో””శంకర కంటి ఆసుపత్రి నానక్ రామ్ గూడ (శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ ), జిల్లా అంతత్వ నివారణ సంస్థ & సురేఖ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ పీర్జాదిగూడ హైదరాబాద్ వారి  ఆధ్వర్యంలో కంప్యూటర్ చే ఉచిత ప్రాథమిక  కంటి పరీక్షలు నిర్వహించారు. 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఈ శిబిరంలో 09 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించినట్లు  వీరికి త్వరలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని క్యాంపు నిర్వహకులు డాక్టర్ తవుటం ఉమామహేశ్వర్ తెలిపారు.   ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది శ్రీకళ, కోఆర్డినేటర్ బాలరాజు, ఎండి మాజీద్,   గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం శ్రీనివాస్, మాజీ గ్రామ సర్పంచ్ పగడాల అనిత వెంకటేష్, కారోపర్ నరేష్, గ్రామ పెద్దలు,  గ్రామప్రజలు పాల్గొన్నారు.

Spread the love