నీట్‌పై ఉచిత మెంటార్‌షిప్‌ టెస్ట్‌ సిరీస్‌

– పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌-2024)కు సిద్ధమవుతున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని బాలబాలికల కోసం ఉచిత మెంటార్‌షిప్‌ టెస్ట్‌ సిరీస్‌ను అందించనున్నట్టు మెటామైండ్‌ అకాడమి ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి చామకూర మల్లారెడ్డి ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు అధిక సంఖ్యలో విజయం సాధించాలంటే లక్ష్యంతో మొదటిసారిగా మెంటార్‌షిప్‌ టెస్ట్‌ సిరీస్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని మెటామైండ్‌ అకాడమి డైరెక్టర్‌ మనోజ్‌కుమార్‌ తెలిపారు. బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. హైదరాబాద్‌లోని దోమల్‌గూడ వద్ద రామకృష్ణ మఠం పక్కన మెటామైండ్‌ అకాడమిలో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

Spread the love