Homeతెలంగాణ రౌండప్మహిళలకు జ్యూట్‌ బ్యాగుల తయారీపై ఉచిత శిక్షణ 

మహిళలకు జ్యూట్‌ బ్యాగుల తయారీపై ఉచిత శిక్షణ 

- Advertisement -

14 రోజుల్లో 14 రకాల బ్యాగుల తయారీపై శిక్షణ.. సర్టిఫికెట్ల అందజేత
నవతెలంగాణ–ఆలేరు రూరల్

ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉచిత జ్యూట్‌ బ్యాగుల తయారీ శిక్షణ కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. కెనరా బ్యాంకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఈ శిక్షణను అందిస్తున్నారు.ఒక్కో బ్యాచ్‌లో 35 మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ మాట్లాడుతూ.. మహిళలకు జ్యూట్‌ బ్యాగుల తయారీ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్లాస్టిక్‌ వినియోగంతో పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని జ్యూట్‌ బ్యాగులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందన్నారు. మహిళలు వ్యవసాయ పనులు చేసుకుంటూనే ఖాళీ సమయంలో ఇంటి వద్ద జ్యూట్‌ బ్యాగులు తయారు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు.

14 రోజులపాటు జరిగే శిక్షణలో 14 రకాల జ్యూట్‌ బ్యాగుల తయారీని నేర్పించనున్నారు. నైపుణ్యం కలిగిన శిక్షకుల ద్వారా శిక్షణ ఇవ్వడంతోపాటు,శిక్షణ పూర్తయిన అనంతరం పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో కెనరా బ్యాంకు భువనగిరి రూరల్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ బి. కిషన్‌,ఏ.సిద్ధులు, మహిళలు నడిగొండ నవ్య,చౌడబోయిన కవిత,లావణ్య, దివ్య,హేమలత,వడ్ల నీరజ,మమత,మెరుగు రమాదేవి,మల్లం రమ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -