నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్..

నవతెలంగాణ-హైదరాబాద్ : జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ జరిగాక, ప్రపంచ టెన్నిస్ ప్రియులకు పసందైన మజా అందించే మరో భారీ ఈవెంట్ ప్రారంభమైంది. టెన్నిస్ రంగంలో ప్రత్యేకంగా, ఎర్రమట్టిపై మ్యాచ్ లు జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ నేటి నుంచి జూన్ 11 వరకు జరగనుంది. మట్టికోట రారాజుగా పేరుగాంచిన స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ ఈసారి టోర్నీకి గైర్హాజరవడం అభిమానులకు నచ్చని విషయమే అయినా, కొత్త సంచలనం, వరల్డ్ నెంబర్ వన్ స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాస్, దిగ్గజ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ ల మధ్య ఆధిపత్య పోరుకు రోలాండ్ గారోస్ వేదికగా నిలవనుంది. ఇవాళ మహిళల సింగిల్స్ పోటీల్లో రెండో ఈడ్ అరియానా సబలెంకా 6-3, 6-2తో ఉక్రెయిన్ అమ్మాయి మార్తా కొస్త్యుక్ ను వరుస సెట్లలో ఓడించింది. పురుషుల సింగిల్స్ లో ఇవాళ ఐదో సీడ్ స్టెఫానో సిట్సిపాస్, 11వ సీడ్ కరెన్ కచనోవ్, ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ తదితరులు తొలి రౌండ్ మ్యాచ్ లు ఆడనున్నారు. మహిళల సింగిల్స్ లో అలైజ్ కార్నెట్, ఎనిమిదో సీడ్ మరియా సక్కారి, మూడో సీడ్ జెస్సికా పెగులా, 9వ సీడ్ దరియా కసాట్కినా తదితరులు పోటీపడనున్నారు.

Spread the love