నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం రెండో సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికి ప్రేషర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. కళాశాలలో చదువుకునే విద్యార్థులు కష్టపడి మంచి మార్కులు సాధించి, కళాశాల, తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని సూచించారు. కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను సమకూర్చుతోందని, వీటిని ప్రతీ విద్యార్థి వినియోగించుకోవాలని చెప్పారు. పదో తరగతి చదువుతో పోలిస్తే భవిష్యత్ విద్యకు ఇంటర్మీడియట్ విద్య విద్యార్థులకు ఎంతో కీలకమైందని గుర్తు చేశారు. చదువులతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యం సాధించాలని తెలిపారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకలో విద్యార్థులు పలు సంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు చేసి అలరించారని పేర్కొన్నారు. ఈ వేడుక కన్నుల పండుగలా జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుల బృందం, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



