విలేఖరి నుంచి…ఎమ్మెల్యే అభ్యర్థి వరకు

– నాలుగో దఫా అసెంబ్లీ బరిలో కూనంనేని
– కాంగ్రెస్‌ మద్దతుతో 8న నామినేషన్‌
నవతెలంగాణ-పాల్వంచ
ఎట్టకేలకు అనేక మార్లు చర్చలు అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సీపీఐతో పొత్తు పెట్టుకుంది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్త గూడెం నియోజకవర్గాన్ని ఆ పార్టీకి కేటాయించింది. ఆ పార్టీ నుంచి సీపీఐ జిల్లా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న సాంబశివరావు పోటీ చేయనున్నారు. ఈ నేపద్యంలో సాంబశివరావు జీవన యానంలో అనేక మజిలీలు చోటుచేసుకున్నాయి. నాలుగో దఫా అసెంబ్లీ బరిలో నిలువనున్న ఆయన పత్రిక ఉప సంపాదకుడిగా, విలేకరిగా జీవనం ప్రారంభించిన ఆయన రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. పత్రిక రంగాన్ని వదిలి విభిన్న మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ తనదైన శైలిలో పురోగమిస్తూ ఉన్నారు. సీపీఐ సాదరణ సభ్యుడు నుంచి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి హౌదాకు చేరుకున్నారు. 1979లో సంవత్సరంలో విశాలాంధ్ర దినపత్రికకు ఉపసంపాదకుడిగా హైదరాబాదులో పనిచేశారు. 1980లో అదే పత్రిక తరఫున కొత్తగూడెం విలేకరిగా వచ్చిన కూనంనేని 1981లో ఆ వృత్తిని వదిలి సీపీఐలో ప్రవేశించారు. కొత్తగూడెం సిపిఐ పట్టణ కార్యదర్శిగా ఆరేళ్లపాటు పనిచేసిన ఆయన 1987లో ప్రత్యక్ష రాజకీయాల ద్వారా కొత్తగూడెం మండల ప్రజాపరిషత్‌ ప్రధమ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీ పదవుల్లో భాగంగా 1991లో కొత్తగూడెం డివిజన్‌ కార్యదర్శిగా పనిచేసిన కూనంనేని 2005లో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్నికయ్యారు. శాసనసభకు గతంలో రెండు ఉపాధ్యాయులు పోటీ చేసిన ఆయనకు గెలుపు దక్కకపోయినా గణనీయమైన ఓట్లు సాధించారు. 1999,2004 ఎన్నికల్లో సుజాతనగర్‌ అసెంబ్లీ తరఫున బరిలో నిలిచారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు టీడీపీ మద్దతు సీపీఐ అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు పోటీ చేయగా ప్రజలు కూనంనేని గెలిపించారు. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుతో కాంగ్రెస్‌ అధిష్టానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కేటాయించడంతో కూనంనేని సాంబశివరావు మళ్లీ బరిలో నిల్వనున్నారు.

Spread the love