Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుడి నుంచి ప్రజాసేవకుడిగా.. రడం భరత్ కుమార్ స్వచ్ఛంద విరమణ

ఉపాధ్యాయుడి నుంచి ప్రజాసేవకుడిగా.. రడం భరత్ కుమార్ స్వచ్ఛంద విరమణ

- Advertisement -

నవతెలంగాణ – గీసుగొండ: పర్వతగిరి మండలంలోని యంపియూపియస్ సోమారం పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలందించిన రడం భరత్ కుమార్ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం గీసుగొండ మండలం రాంపూర్ గ్రామ సర్పంచ్‌గా సేవలందిస్తున్న ఆయన సమాజ సేవ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ.. తక్కువ కాలంలోనే భరత్ కుమార్ విద్యార్థుల సంక్షేమం, పాఠశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం, తన స్వంత ఖర్చులతో యూనిఫాంలు, బ్యాగులు అందించడం ఆయన సేవాభావానికి నిదర్శనమని కొనియాడారు.

ఒక ఉపాధ్యాయునిగా ప్రారంభమై, సమాజ సేవలో ముందుండే నాయకుడిగా ఎదిగి సర్పంచ్ స్థాయికి చేరుకోవడం అరుదైన విషయమని సహ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. తన సేవా కాలంలో క్రమశిక్షణ, నిబద్ధతతో విద్యార్థుల అభివృద్ధికి కృషి చేసి పాఠశాలలో ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, విద్యార్థులు, అభిమానులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రడం భరత్ కుమార్ మాట్లాడుతూ, తనపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో మరింత కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -