మే 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ : ఎఫ్‌టిసిసిఐ ఎక్సలెన్సీ అవార్డ్స్-2022 వాటాదారుల సమావేశం బుధవారం జరిగింది. దీనికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. 106 సంవత్సరాల చరిత్ర గల తెలంగాణా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్‌టిసిసిఐ) జూలై 3వ తేదీన హెచ్‌ఐసిసిలో 23 విభాగాల్లో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. మే 31 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని తెలిపింది. ఒక్కొక్కటి 2 కేజీల వెండితో చేసిన ఒరిజినల్ ట్రోఫీలు ప్రదర్శించబడుతాయని అనిల్ అగర్వాల్ తెలిపారు. 1974లో ఏర్పాటు చేసిన అవార్డులను గత 49 ఏళ్లుగా (మహమ్మారి కాలంలో మినహా) నిరంతరాయంగా అందిస్తున్నామన్నారు.