– అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే కవ్వంపల్లి
నవతెలంగాణ – బెజ్జంకి
గత ప్రభుత్వం నిధుల్లేక విస్మరించిన అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వార నిధులు సమకూర్చి శంకుస్థాపనలు చేపడుతున్నామని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్మామి ఆలయం వద్ద రూ.కోటి రుపాయలతో చేపట్టనున్న సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్థానిక ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు,కాంగ్రెస్ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆలయ ప్రతిష్టను కాపాడేల ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు.అంతకుముందు దాచారం గ్రామంలో ప్రజల దాహర్తిని తీర్చడానికి నిర్మించిన నూతన ఉపరితల నీటి సరఫరా ట్యాంక్ ను ఎమ్మెల్యే ప్రారంభించి,గాగీల్లపూర్,బేగంపేట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.నాయకులు రత్నాకర్ రెడ్డి,దామోదర్, పోచయ్య,ప్రవీన్,మల్లేశం, నర్సయ్య,ప్రభాకర్,ఆలయ చైర్మన్ రాములు, కార్యకర్తలు పాల్గొన్నారు.