ఘనంగ జాతీయ గణిత దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ- రాయపోల్
గణిత శాస్త్రవేత్త  శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రభుత్వం  ప్రకటించడంతో మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు. శుక్రవారం రాయపోల్ మండలంలోని బేగంపేట  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామానుజన్ జయంతి వేడుకలు నిర్వహించారు. జాతీయ గణిత దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణిత పితామహుడు రామానుజన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందన్నారు. రామానుజన్ చిన్నతనంలోనే గణితంలో అనేక మెళకువలు నేర్చుకుని  పై తరగతి విద్యార్థులకు కూడా గణిత క్లాసులు చెప్పేవారని రామానుజన్ కి ఇంగ్లాండ్ లోని రాయల్ సొసైటీ ఫెలోషిప్ అందుకున్న గణిత మేధావి  అన్నారు.  అలాగే 13 సంవత్సరాల వయసులోనే త్రికోనమితి సిద్ధాంతాలను అతి సులభంగా అర్థం చేసుకొని అనేక కొత్త సిద్ధాంతాలను కనిపెట్టడాని తెలిపారు. ఆయన ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి కృషి చేయాలని తెలిపారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్ లను ప్రారంభించారు. విద్యార్థుల చేత తయారు చేయబడిన గణిత ప్రదర్శనలు, రంగవల్లులు తిలకించి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి బహుమతులు ప్రధానం చేశారు. పదవ తరగతి విద్యార్థులు బాగా చదవాలని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి నర్సమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి, ఎంఎన్ఓ సత్యనారాయణ రెడ్డి,గ్రామ సర్పంచ్ ప్రవీణ్, ఎస్ఎంసి చైర్మన్ స్వామి గౌడ్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love