గిఫ్టెడ్‌ చిల్డ్రన్‌ కోకిరాల జాన్విక

– మణుగూరుకు ఇండియా ఆఫ్‌ బుక్‌ రికార్డ్స్‌
– మేథావుల ప్రశంసలు
– అందుకుంటున్న యూకేజీ విద్యార్థి
నవతెలంగాణ-మణుగూరు
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే సామెత అంత తేలికైనది కాదు, తల్లిదండ్రుల కృషి పట్టుదల వెలకట్టలేనిది. అయిన దాని వెనకాల ఎన్నో ఆటంకాలు ఉంటాయి. మన చుట్టూ ఉన్న పరిసరాలు రోజు వాడే వస్తువులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. నేటి ఆధునిక కాలంలో టెలివిజన్‌ సెల్‌ ఫోన్‌ మానవుడి జీవితంలో సగభాగం అయిపోయినాయి. వీటి వల్ల విద్యార్థుల జీవితాలు చిన్నా భిన్నం అవుతున్నాయి. చదువుకు దూరం అవుతున్నారు. చెడు వ్యసనాలకు దగ్గరవుతున్నారు. కానీ వీటంన్నింటికీ భిన్నంగా మణుగూరు మండలం పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న కోకిరాల జగదీష్‌ – దివ్యలకు ఇద్దరు కుమార్తెలు. ప్రథమ పుత్రిక జాన్విక, ద్వితీయ పుత్రిక రితిక యూకేజీ చదువుతోంది. జాన్విక మేధావులు సైతం చెప్పలేని 108 మూలకాల పేర్లను అవలీలంగా చెప్పుతూ, బ్లాక్‌ బోర్డుపై రాస్తూ ఉంటుంది. ఇది గమనించిన ఏసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించుకుంది. ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ వారు సర్టిఫికెట్‌ ఐడి కార్డ్‌ బ్యాడ్జి మెడల్‌ పెన్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డును బహూకరించారు. ఎక్సలెంట్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్‌ బొంబాయి కాలనీ పాఠశాల నందు చదువుతున్న యూకేజీ విద్యార్థి కొకిరాల జాన్విక గిఫ్టేడ్‌ చిల్డ్రన్‌గా అవతరించింది. మేధావుల ప్రశంసలను పొందుతున్నది. పిరియాడిక్‌ టేబుల్‌ లో రేడియం పొలోనియం ఆవిష్కరించిన మేరీ క్యూరీ ఫ్యామిలీ కుటుంబానికి మూడు నోబెల్‌ ప్రైజ్‌లు లభించాయి 118 మూలకాల ఆవిష్కర్తలలో ఏకైక మహిళ మేరీ క్యూరీ ఆమె అడుగుజాడల్లో కోకిరాల జాన్విక ఉన్నత శిఖరాల అధిరోహించాలని పెద్దలు ఆశీర్వదించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో పాఠశాల డైరెక్టర్లు ఎండి ఖాదర్‌ యూసఫ్‌ షరీఫ్‌ ఎండి యాకూబ్‌ జే.యం ఖాన్‌, ఉపాధ్యాయులు పెద్దలు ఆ పాపను అభినందించి ఆశీర్వదించారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని సైన్సులో ఉన్నత స్థానాలు చేరుకోవాలని ప్రశంసించారు. 4 నిమిషాల్లో 118 పిరియాడిక్‌ ఎలిమెంట్స్‌ చదవడం రాయడం లో రికార్డులు బ్రేక్‌ చేసింది. తండ్రి కోకిల జగదీష్‌ భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ జూనియర్‌ అకౌంటెంట్‌ గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాకున్న ఇద్దరు కూతుర్లు కూడా చదువులో ప్రథమ స్థానం రాణిస్తున్నారని ఆడపిల్లల తండ్రిగా గర్వపడుతున్నారని పేర్కొన్నారు.

Spread the love