ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

నవతెలంగాణ – రాయపర్తి
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టినా ఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానికులు తెలిపిన కథనం మేరకు మండలంలోని జయరాం తండా గ్రామపంచాయతీ పరిధిలోని సుక్య తండాకు చెందిన గుగులోత్ సావిత్రిని (23) బాలు నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గోప్య తండాకు చెందిన భూక్య ప్రతాప్ ప్రేమిస్తున్న పెళ్లి చేసుకుంటా అని నమ్మబలికి మోసం చేశాడంటూ ప్రతాప్ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టింది అని వివరించారు. ప్రతాప్ కుటుంబ సభ్యులు సైతం గతంలో సావిత్రితో పెళ్లి విషయంలో సానుకూలంగా స్పందించి ప్రస్తుతం మొఖం చాటేస్తున్నారని తెలిపారు. సావిత్రి – ప్రతాప్ ప్రేమ పెళ్లి వ్యవహారంలో ప్రతాప్ తండాకు చెందిన కొందరు పెద్ద  మనుషులు విషయాన్ని కొలిక్కి రాకుండా స్వార్థపూరితంగా వివరిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో కొంతమంది గ్రామ సర్పంచులు కూడా ఉన్నారంటూ వాపోయారు. తనకు న్యాయం జరిగేంత వరకు ఆందోళనను విరమించనని స్పష్టం చేశారు.
Spread the love