ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్న బాలికల హాస్టల్స్..

– మినీ గురుకులం ఎస్టి బాలికల హాస్టల్లో పురుగుల బియ్యం

నవతెలంగాణ – చివ్వేంల: ఉమ్మడి జిల్లాలో హాస్టల్ లో బాలికలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు రోజు చూస్తూనే ఉన్నాము.. అయిన హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం విడడం లేదు.. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ గిరిజన గురుకుల బాలికల హాస్టల్లో ఇంటర్మీడియట్ వరకు బాలికలు విద్యను అభ్యసిస్తూ  హాస్టల్లో ఉంటారు. సోమవారం గెట్ వాచ్ మెన్ లేకపోవడమే  కాక గేట్కు తాళం వెయ్యకుండా గేట్లు పూర్తిగా ఓపెన్ చేసి ఉన్నాయి.. గేట్లు ఓపెన్ చేసి ఉండడం వల్ల ఆకతాయిలు ఎవరైనా హాస్టల్లో చొరబడి బాలికలపైన  దాడి చేస్తే  బాధ్యత ఎవరు వహిస్తారని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా  అధికారులు బాలికల హాస్టల్ లో ఉండే సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండకుండా నిత్యం అప్రమత్తంగా ఉంటూ బాలికలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
పురుగుల బియ్యం దర్శనమిస్తున్న మినీ గురుకుల ఎస్టి  హాస్టల్…
మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వెనకాల ఉన్న మినీ గురుకులం ఎస్టీ బాలికల హాస్టల్ లో పురుగుల బియ్యం తో భోజనం పెడుతున్నారని ఆరోపణలు రావడం తో    నవతెలంగాణ హాస్టల్ ను సందర్శించడం జరిగింది. హాస్టల్ లో పురుగుల బియ్యం దర్శనం ఇవ్వడం తోఆరోపణలకు  బలం చేకూరు తుంది.. మినీ గురుకులంపై పూర్తి విచారణ జరిపించి పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టేవిదంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు..
Spread the love