Sunday, May 24, 2026
E-PAPER
Homeదర్వాజకవిత్వమా కాస్తకౌగిలి ఇవ్వు

కవిత్వమా కాస్తకౌగిలి ఇవ్వు

- Advertisement -

చాలా రోజులయ్యింది నిన్ను చూడక గడియారం ముల్లు
ఎన్ని సుట్లు తిరిగిందో
నిన్ను ముద్దాడక
నువ్వు వస్తే
మండు వేసవిలో మల్లెలు పూచినట్టు
ఎటు నుండి వస్తావో
గడ్డి పరక మీద
మంచు బిందువు రాలినట్టు
ఎండు కొమ్మ మీద
వసంతం వాలినట్టు
రా ప్రియా రా
నువ్వు వెంటపడినపుడల్లా
అనుభవించిన
ఆ ఉపవాసాలే నాకిష్టం
లైలా మజ్నూ కూడా చవి చూడని
ఈ విరహం నాకే ఎందుకు
సలీం అనార్కలి గుండెలు బాదుకోని
ఈ దూరం నాకే ఎందుకు
ఊపిరాడని పని జంఝాటంలో
నువ్వే కదా ప్రాణవాయువు
నువ్వు రాకపోతే
ఈ కవితా ప్రపంచంలో
దారం తెగిన గాలిపటంలా
ఎటు పోతానో
రెక్కలు విరిగి బొక్కలు తేలినా
పెద్ద చేపలు రుచి మరిగిన
చిన్న చేపలు
కష్టాల కడలి ఈదుతున్నయి
నువ్వే లేకపోతే
ఈ లోకాన్ని ఏ కన్నుతో చూడాలి.
గజ్జెల రామకృష్ణ, 8977412795

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -