– సీఆర్పీఎఫ్కు కేఆర్ఎంబీ ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
నాగార్జునసాగర్ డ్యామ్‌కు మరమ్మతులు చేసేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రిజర్వు పోలీస్ దళం (సీఆర్పీఎఫ్)కు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆ మేరకు సహకరించాలని సీఆర్పీఎఫ్కు సూచించింది. సాగర్‌డ్యామ్ 26వ రేడియల్ క్రస్ట్ గేట్ల ఏర్పాటు, ఎరెక్షన్, టెస్టింగ్, కొత్త కంట్రోల్ ప్యానెళ్ల ఏర్పాటు, కేబుల్, ఎలక్ట్రిక్ వస్తువుల సరఫరా తదితర పనుల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ అధికారులను అనుమతించాలని సీఆర్పీఎఫ్కు చెందిన ఇద్దరు కమాండెంట్లకు కేఆర్ఎంబీ ఆదేశాలు ఇచ్చింది.