తక్కువ రిటైర్మెంట్‌ ఇవ్వడం సరైనది కాదు

Giving less retirement is not right– యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రాజు
– రెండవ రోజు కొనసాగుతున్న అంగన్‌వాడీల రిలే దీక్షలు
నవతెలంగాణ-పాల్వంచ
నలభై సంవత్సరాలుగా ప్రభుత్వం పని చేయించుకుని, ఉత్తి చేతులతోటి ఎటువంటి పెన్షన్‌ లేకుండా అతి తక్కువ రిటైర్మెంట్‌ ఇచ్చి అంగన్‌వాడీలను ఇంటికి పంపించడం సరైనది కాదని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రాజు, జిల్లా కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం కలెక్టర్‌ ఆఫీస్‌ దగ్గర రెండవ రోజు కొనసాగుతున్న రిలే దీక్షలను ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు వారి బందం దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే పిల్లలను ఇల్లు ఇల్లు తిరిగి పిల్లలను తీసుకువచ్చి వారికి బాత్రూం వచ్చిన, టాయిలెట్‌ వచ్చిన, తీసుకెళ్లి కడిగి విద్య బుద్ధులు నేర్పిఈ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే పిల్లలను తీర్చిదిద్దినటువంటి ఘనత అంగన్వాడీలదేనే అన్నారు. వారు అడుగుతున్నావి 40 సంవత్సరాలు పనిచేసినటువంటి మాకు ఉద్యోగం చేసే సమయంలో చాలీచాలని వేతనాలు ఇవ్వలేదనీ, దిగిపోయేముందన్నా చట్టపరమైన న్యాయబద్ధమైన రిటైర్మెంట్‌ సౌకర్యం కల్పించాలని అడగడంలో న్యాయం ఉందని అన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలన్నారు. అంగన్వాడీ లా దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం అంగన్వాడి హెల్పర్స్‌ టీచర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జీ.పద్మ మాట్లాడుతూ అక్టోబర్‌2023లో 24 రోజులు సమ్మె చేసిన కాలంలో అంగన్వాడీల టెంట్లు దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అనేక వాగ్దానాలు ఇచ్చారని ఇచ్చినటువంటి వారు ఏ ఒక్కటి పరిష్కారం చేయట్లేదని, గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమ్మె కాలంలో అంగన్వాడీలకు హామీ ఇచ్చిందని ఆ హామీ ప్రకారమే సమ్మెను విరమించామని అలాంటి హామీలను ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చవలసిన అవసరం ఉందన్నారు. సమ్మె కాలంలో అంగన్వాడీలకు రూ.2 లక్షలు టీచర్స్‌కి, హెల్పర్స్‌ ఓక లక్ష, ఆసరా పెన్షన్‌ కాకుండా అదనంగా పెంచుతామనీ, వాలంటరీ రిటైర్మెంట్‌ సౌకర్యం కల్పిస్తామని, ఈ ఒప్పందంతో సమ్మె విరమించామని అన్నారు. ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్స్‌ పరిష్కారం ఇస్తూ జీవో జారీ చేసేంతవరకు మా న్యాయమైన డిమాండ్స్‌ పరిష్కరించే అంతవరకు రిలే దీక్షలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా అధ్యక్షరాలు ఈసం వెంకటమ్మ, జీ. పద్మ, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కే.సత్య, మండల కన్వీనర్‌ పాయం రాధాకుమారి, అంగన్వాడి జిల్లా నాయకులు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.విజయశీల, రాంబాయి, రిటైర్మెంట్‌ అయ్యే హెల్పర్స్‌ తిరుమల బాయమ్మ, లక్ష్మీనరసు, చిట్టమ్మ, నిర్మల, ఎంకమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love