నవతెలంగాణ -హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం లాలాగూడలోని క్యారేజ్ వర్క్‌షాప్ తనిఖీ చేశారు. వర్క్‌షాప్‌లోని నిర్వహణ, మరమ్మతు షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ జి సుమనా వర్క్‌షాప్ పనితీరు గురించి వివరించారు. జనరల్ మేనేజర్ వీల్ షాప్ నుంచి తనిఖీని ప్రారంభించి, ఆ తర్వాత డీవీ ఓవర్‌హాల్ విభాగం, ఎయిర్ బ్రేక్ షాప్, పెయింట్ షాప్, స్ప్రింగ్ షాప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా లాలాగూడ క్యారేజ్ వర్క్‌షాప్ చీఫ్, మేనేజర్‌తోపాటు అక్కడ పనిచేసే సిబ్బంది విధి నిర్వహణలో పాటిస్తున్న వివిధ భద్రతా ప్రమాణాలు , సురక్షా విధానాలను జనరల్ మేనేజర్‌కు వివరించారు. అంతేకాకుండా, వర్క్‌షాప్‌లో అందుబాటులో ఉన్న వివిధ అత్యాధునిక పరికరాల పనితీరు, వాటి నిర్వహణ పద్ధతులను కూడా ఆమె ఈ సందర్భంగా జీఎంకు కూలంకషంగా తెలియజేశారు. ఈ తనిఖీల్లో భాగంగా వర్క్‌షాప్‌లోని అత్యాధునిక , అధునాతన వర్క్ స్టేషన్లను, యంత్రాలు, పరికరాలను కూడా పరిశీలించారు. ఇందులో భాగంగా ఎల్‌హెచ్‌బి వర్క్ స్టేషన్, నిప్యులేటర్, డైనమిక్ వీల్ బ్యాలెన్సింగ్ మెషిన్, షాక్ అబ్జార్బర్ టెస్టింగ్ మెషిన్ కూడా సందర్శించారు. వీటితో పాటు ఎయిర్‌బ్రేక్ సబ్-స్టోర్స్, నూతన ట్రిమ్మింగ్ షాప్, ఆప్టికల్ ఎమిషన్ స్పెక్ట్రోమీటర్, యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ వంటి అధునాతన సాంకేతిక విభాగాలను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పనిలో నాణ్యతా ప్రమాణాలను నిరంతరం కొనసాగిస్తున్న తీరును అభినందించారు.
అలాగే పని నైపుణ్యాలను మెరుగుపరచు కోవడానికి సరికొత్త సాంకేతికతను అలవర్చుకోవడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వర్క్‌షాప్‌ను స్క్రాప్ రహిత యూనిట్‌గా మారుస్తూ, అక్కడ పచ్చని పర్యావరణాన్ని కాపాడుతున్న సిబ్బందిని, అధికారులను ఆయన ప్రశంసించారు. భారతీయ రైల్వేలోనే లాలాగూడ వర్క్‌షాప్ భారతీయ రైల్వేలలోని అత్యుత్తమ కోచ్ నిర్వహణ కేంద్రాలలో ఒకటిగా పరిగణించాలని ఆయన నొక్కి చెప్పారు, అలాగే ఈ ఘనతకు అక్కడి సిబ్బందే కారణమని అభినందించారు.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం లాలాగూడలోని క్యారేజ్ వర్క్‌షాప్ తనిఖీ చేశారు. వర్క్‌షాప్‌లోని నిర్వహణ, మరమ్మతు షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ జి సుమనా వర్క్‌షాప్ పనితీరు గురించి వివరించారు. జనరల్ మేనేజర్ వీల్ షాప్ నుంచి తనిఖీని ప్రారంభించి, ఆ తర్వాత డీవీ ఓవర్‌హాల్ విభాగం, ఎయిర్ బ్రేక్ షాప్, పెయింట్ షాప్, స్ప్రింగ్ షాప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా లాలాగూడ క్యారేజ్ వర్క్‌షాప్ చీఫ్, మేనేజర్‌తోపాటు అక్కడ పనిచేసే సిబ్బంది విధి నిర్వహణలో పాటిస్తున్న వివిధ భద్రతా ప్రమాణాలు , సురక్షా విధానాలను జనరల్ మేనేజర్‌కు వివరించారు.
అంతేకాకుండా, వర్క్‌షాప్‌లో అందుబాటులో ఉన్న వివిధ అత్యాధునిక పరికరాల పనితీరు, వాటి నిర్వహణ పద్ధతులను కూడా ఆమె ఈ సందర్భంగా జీఎంకు కూలంకషంగా తెలియజేశారు. ఈ తనిఖీల్లో భాగంగా వర్క్‌షాప్‌లోని అత్యాధునిక , అధునాతన వర్క్ స్టేషన్లను, యంత్రాలు, పరికరాలను కూడా పరిశీలించారు. ఇందులో భాగంగా ఎల్‌హెచ్‌బి వర్క్ స్టేషన్, నిప్యులేటర్, డైనమిక్ వీల్ బ్యాలెన్సింగ్ మెషిన్, షాక్ అబ్జార్బర్ టెస్టింగ్ మెషిన్ కూడా సందర్శించారు. వీటితో పాటు ఎయిర్‌బ్రేక్ సబ్-స్టోర్స్, నూతన ట్రిమ్మింగ్ షాప్, ఆప్టికల్ ఎమిషన్ స్పెక్ట్రోమీటర్, యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ వంటి అధునాతన సాంకేతిక విభాగాలను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పనిలో నాణ్యతా ప్రమాణాలను నిరంతరం కొనసాగిస్తున్న తీరును అభినందించారు. అలాగే పని నైపుణ్యాలను మెరుగుపరచు కోవడానికి సరికొత్త సాంకేతికతను అలవర్చుకోవడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వర్క్‌షాప్‌ను స్క్రాప్ రహిత యూనిట్‌గా మారుస్తూ, అక్కడ పచ్చని పర్యావరణాన్ని కాపాడుతున్న సిబ్బందిని, అధికారులను ఆయన ప్రశంసించారు. భారతీయ రైల్వేలోనే లాలాగూడ వర్క్‌షాప్ భారతీయ రైల్వేలలోని అత్యుత్తమ కోచ్ నిర్వహణ కేంద్రాలలో ఒకటిగా పరిగణించాలని ఆయన నొక్కి చెప్పారు, అలాగే ఈ ఘనతకు అక్కడి సిబ్బందే కారణమని అభినందించారు.
లాలాగూడ రైల్వే క్యారేజ్ వర్క్‌షాపును తనిఖీ చేసిన జీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



