ఇన్నర్ వీల్ క్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో గో గ్రీన్ కార్యక్రమాన్ని భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ కొక్కలకొండ అరుణ మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని గో గ్రీన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ విల్ క్లబ్ సెక్రెటరీ డాక్టర్ చావా అసలేష, ఫాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ జయశ్రీ, సి డబ్ల్యూ సి చైర్మన్ ఇన్నర్ వీల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ బండారు జయశ్రీ, లావణ్య , కల్పన ట్రెజరర్ వెంకమ్మ సభ్యులు స్వాతి, భాగ్య లు పాల్గొన్నారు.